అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..! - did anil kapoor confirms tiger shroff and disha patani are in dating
close
Published : 04/01/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..!

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశాపటాని, కండల వీరుడు టైగర్‌ష్రాఫ్‌ ప్రేమలో విహరిస్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు  తెగ వినిపిస్తున్నాయి. అయితే.. ప్రేమవ్యవహారంపై ఇప్పటి వరకూ వీళ్ల స్పందించలేదు. కాగా.. బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ ఈ ప్రేమజంట విషయంలో ఓ క్లూ ఇచ్చారు. ఆయన ఇటీవల కపిల్‌శర్మ చాట్‌లో పాల్గొన్నారు. మీకు అవకాశం వస్తే ఏ బాలీవుడ్‌ నటుడి ఆహారం దొంగిలించాలని అనుకుంటున్నారు..? అని అనిల్‌కపూర్‌ను కపిల్‌శర్మ ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. టైగర్‌ష్రాఫ్‌ ఏం తింటున్నాడో తెలుసుకొని ఆ ఆహారాన్ని దొంగిలించాలనుకుంటున్నట్లు అనిల్‌కపూర్‌ చెప్పాడు. అయితే.. ‘మలంగ్‌’ సినిమాలో అనిల్‌కపూర్‌.. దిశా పటానితో కలిసి పనిచేశారు. ఆ సమయంలో ఒకసారి ఆమె ఆహారాన్ని దొంగిలించినట్లు చెప్పడం గమనార్హం. తాజాగా ష్రాఫ్‌ గురించి ప్రస్తావించడంతో ప్రేమ పుకార్లకు బలం చేకూరింది. ఇలా వాళ్లిద్దరి ప్రేమలో ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పేశారు.

కాగా.. ప్రేమ వ్యవహారంపై ఈ జంట ఇప్పటికీ నోరు విప్పలేదు. అయితే.. పలుమార్లు ఇద్దరూ కలిసి పార్టీలు.. ఇతర కార్యక్రమాలకు వెళ్లిన దశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీళ్లిద్దరూ కలిసి ‘బాఘీ 2’లో కలిసి పనిచేశారు. ఆ సినిమా మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రశంసలైతే వచ్చాయి. దిశా తన తర్వాతి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తోంది. ఆమె ‘రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో కనిపించనుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు ఆమె పచ్చజెండా ఊపింది.

ఇదీ చదవండి..

మరోసారి తెరపైకి ‘సమ్మోహనం’ కాంబోమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని