నా కెరీర్‌కు వాళ్లు పెద్ద గిఫ్ట్‌ ఇచ్చారు: సామ్‌ - dil raju and gunasekhar given me the best gift says samantha
close
Updated : 15/03/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కెరీర్‌కు వాళ్లు పెద్ద గిఫ్ట్‌ ఇచ్చారు: సామ్‌

పట్టాలెక్కిన అపురూప ప్రేమకావ్యం

హైదరాబాద్‌: తన పదేళ్ల కెరీర్‌లో ఇన్నాళ్లకు దిల్‌రాజు, గుణశేఖర్‌ ఓ పెద్ద బహుమతినిచ్చారని అగ్రకథానాయిక సమంత అక్కినేని అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న అపురూప ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. అలనాటి శాకుంతల-దుష్యంతుల ప్రేమకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులతోపాటు దర్శక-నిర్మాతలు హాజరయ్యారు. అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పూజా కార్యక్రమం అనంతరం సమంత మాట్లాడుతూ.. ‘నటిగా నా కెరీర్‌ ప్రారంభించి దాదాపు పదేళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ 50 సినిమాల్లో నటించాను. కథానాయిక, విలన్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే విభిన్నమైన రోల్స్‌ పోషించాను. కానీ, చిన్నప్పటి నుంచి రాకుమార్తెగా కనిపించాలనుకునేదాన్ని. అదే నా డ్రీమ్‌ రోల్‌. ఎన్నో పాత్రల్లో నటించినప్పటికీ నా రోల్‌ చేయలేదనే లోటు ఎప్పటి నుంచో నాలో ఉండిపోయింది. ఇప్పుడు గుణశేఖర్‌ సర్‌ వల్ల ‘శాకుంతలం’తో నా కల నెరవేరుతోంది. ఈ పదేళ్ల నా కెరీర్‌లో గుణశేఖర్‌, దిల్‌రాజు.. ‘శాకుంతలం’ రూపంలో అతిపెద్ద బహుమతి అందించారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందిస్తున్నా’’ అని సమంత తెలిపారు. గుణశేఖర్‌ కుమార్తె నీలిమ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అలాగే, ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌మోహన్‌ సందడి చేయనున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని