Allu Arjun: ‘ఐకాన్’పై దిల్‌ రాజు క్లారిటీ - dil raju once again clears about allu arjun icon
close
Published : 18/04/2021 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: ‘ఐకాన్’పై దిల్‌ రాజు క్లారిటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. పవన్‌తో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కిస్తుండటంతో ‘ఐకాన్‌’ వాయిదా పడింది. ఇప్పుడు పవన్‌ చిత్రం పూర్తవడంతో బన్నితో సినిమా ఎప్పుడు మొదలు పెడతారన్న ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. దీనిపై తాజాగా నిర్మాత దిల్‌రాజు స్పష్టత ఇచ్చారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘ఐకాన్‌’ గురించి మాట్లాడారు.

‘‘మా బ్యానర్‌లో తదుపరి చిత్రం ‘ఐకాన్‌’. ఆ కథ నా మనసుకు బాగా నచ్చింది. వేణు కథ చెప్పిన దగ్గరి నుంచి దానితోనే ప్రయాణం చేశాం. స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. ఇతర కారణాల వల్ల కాస్త ముందూ వెనుక అవుతుందంతే.. త్వరలోనే ప్రారంభిస్తాం’’

-విలేకరుల సమావేశంలో దిల్‌రాజు

ఇటీవల ‘పుష్ప’ టీజర్‌ చివరిలో అల్లు అర్జున్‌ పేరు ముందు ‘స్టైలిష్‌ స్టార్‌’కు బదులుగా ‘ఐకాన్‌ స్టార్‌’ అని ఎందుకు వేశారని దిల్‌రాజును ప్రశ్నించగా, అది ఆయన పెట్టుకున్నారేమో, తమకు తెలియదని బదులిచ్చారు.

ఐటమ్‌ సాంగ్‌ పెట్టి ఉంటే సినిమా బతికేది కాదు!

‘వకీల్‌సాబ్’లో మాస్‌‌/ఐటమ్‌ సాంగ్‌ పెట్టి ఉంటే సినిమా బతికేది కాదని దిల్‌ రాజు అన్నారు. ఆ విషయంలో చిత్ర బృందానికి స్పష్టత ఉందన్నారు. వకీల్‌సాబ్‌లాంటి సందేశాత్మక చిత్రాల్లో మాస్‌ సాంగ్స్‌ పెడితే మిస్‌ ఫైర్‌ అవుతుందని వివరించారు.పవన్‌కల్యాణ్‌తో మరో సినిమా తీయడానికీ తాము సిద్ధంగా ఉన్నామని, దర్శకుడు వేణుకు మంచి ఆలోచన వస్తే, నేరుగా పవన్‌కే కథ చెబుతామన్నారు. ‘వకీల్‌సాబ్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌పై వస్తున్న వార్తలపైనా దిల్‌రాజు స్పష్టత ఇచ్చారు. భోజనంలో నాలుగు కూరలు వడ్డిస్తే, అన్నీ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదన్నారు. సత్యదేవ్‌ గతం ఏంటో చెప్పాలనే ఉద్దేశంతోనే దర్శకుడు ఫ్లాష్‌ బ్యాక్‌ రాసుకున్నాడనీ, అది కూడా 20 నిమిషాల్లోనే ముగించాడని దిల్‌రాజు తెలిపారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులు, అభిమానులకు దిల్‌రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్‌ కృతజ్ఞతలు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని