నేను సెలెక్టర్‌ అయితే.. అశ్విన్‌ను తెచ్చేవాడిని..! - dilip vengsarkar says if he was the chief selector would have bring ashwin back to the white ball setup
close
Published : 28/03/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను సెలెక్టర్‌ అయితే.. అశ్విన్‌ను తెచ్చేవాడిని..!

మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడు తాను టీమ్‌ఇండియా ఛీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్నట్లయితే.. రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తీసుకు వచ్చేవాడినని మాజీ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అన్నారు. మొన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఇద్దరూ 16 ఓవర్లలో మొత్తం 156 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. ముఖ్యంగా అనుభవజ్ఞుడైన కుల్‌దీప్‌ ఈ మధ్య పెద్దగా రాణించకపోవడంతో అతడిని జట్టులో ఉంచాలా? వద్దా? అనేదానిపై చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి మళ్లీ సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను తీసుకురావాలనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దీన్ని మాజీ సెలెక్టర్‌ వెంగ్‌సర్కార్‌ సమర్థించారు. ‘ఇప్పుడు నేను ఛీఫ్‌ సెలెక్టర్‌గా ఉంటే అశ్విన్‌ను కచ్చితంగా తీసుకు వచ్చేవాడిని. ఎందుకంటే అతడెంతో అనుభవమున్న బౌలర్‌. తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. టెస్టుల్లో ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు’ అని ఓ జాతీయ పత్రికతో పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని