ఆ చిన్నారులను దత్తత తీసుకున్నా: దిల్‌రాజ్‌ - dilraju adopted three little kids
close
Updated : 02/08/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ చిన్నారులను దత్తత తీసుకున్నా: దిల్‌రాజ్‌

హైదరాబాద్‌ : యాదాద్రి జిల్లాకు చెందిన అనాథలను దత్తత తీసుకున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ ప్రకటించారు. ఆత్మకూరుకు చెందిన మనోహర్‌, లాస్య, యశ్వంత్‌ను దత్తత తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ముగ్గురు చిన్నారులను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై వీరి ముగ్గురి సంరక్షణ బాధ్యత తానే చూసుకుంటానని తెలిపారు. వీరి విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లికి దిల్‌రాజ్‌ ధన్యవాదాలు చెప్పారు.

ఈ ముగ్గురు చిన్నారుల తల్లి ఇటీవలే చనిపోయింది. తండ్రి కూడా గతంలో మరణించాడు. దీంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి.. దిల్‌రాజ్‌ దృష్టికి తీసుకువచ్చి సహాయం చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన దిల్‌రాజ్‌.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం ఎంతో బాధాకరమని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటానన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని