పవన్‌.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు - dilraju suggest every one to wear a mask behalf of pawan
close
Updated : 11/04/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు

హైదరాబాద్: బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శక నిర్మాతలు వేణు శ్రీరామ్‌, దిల్‌రాజుతోపాటు హీరోయిన్స్‌ అంజలి, అనన్య నగరంలోని ఓ థియేటర్‌లో సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నామని పవన్‌కల్యాణ్‌ గారికి చెప్పాం. దాంతో మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేయమని ఆయన తెలిపారు. ‘బయట పరిస్థితులు అస్సలు బాలేదు.. కాబట్టి దయచేసి సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్‌లతో రండి. అలాగే సినిమా చూస్తున్న సమయంలోనూ మాస్క్‌ని తీయకండి. జాగ్రత్తగా ఉండండి’ అని పవన్‌ మీకు ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు’’ అని దిల్‌రాజు వివరించారు. అంతేకాకుండా సినిమా విజయం సాధించిన సందర్భంగా త్వరలోనే ‘వకీల్‌సాబ్‌ మీట్‌’ పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. దానికి పవన్‌కల్యాణ్‌ వస్తున్నారని చెప్పారు.

పవన్‌తో పనిచేయడం ఇది రెండోసారి: వేణుశ్రీరామ్‌

‘వకీల్‌సాబ్‌’ చిత్రం హిట్‌ అందుకున్న సందర్భంగా వేణుశ్రీరామ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన అభిమాన హీరోతో కలిసి పనిచేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ‘వకీల్‌సాబ్‌’ కంటే ముందే తాను పవన్‌తో కలిసి పనిచేశానని తెలిపారు. ‘ఓ శీతలపానియం యాడ్‌ షూట్‌లో భాగంగా పవన్‌కల్యాణ్‌తో కలిసి మొదటిసారి పనిచేశాను. ఆ వాణిజ్య ప్రకటనను ఓ బాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేశారు. ఆ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలంటే నేను వెళ్లాను. అలా, మొదటిసారి పవన్‌ని దగ్గరగా చూశాను. కానీ మాట్లాడలేదు. ‘వకీల్‌సాబ్’ సినిమా కోసం మొదటిసారి పవన్‌ని కలిసినప్పుడు.. నాకెంతో ఆనందంగా అనిపించింది’ అని వేణు శ్రీరామ్‌ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని