పంత్‌.. ప్రత్యర్థికి భయం పుట్టిస్తాడు: డీకే - dinesh karthik while praising rishabh pant says he makes fear in the opposition team
close
Published : 08/06/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌.. ప్రత్యర్థికి భయం పుట్టిస్తాడు: డీకే

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ తన సాహసోపేతమైన షాట్లతో ప్రత్యర్థి జట్టులో భయం పుట్టిస్తాడని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. కొద్ది నెలలుగా పంత్‌ అద్భుతంగా ఆడుతున్నాడని, ఒత్తిడి సమయాల్లో రాణిస్తూ టీమ్‌ఇండియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడని డీకే ప్రశంసించాడు. టీమ్‌ఇండియా తరఫున వంద టెస్టులు ఆడాలని ఆకాంక్షించాడు.

‘పంత్‌కున్న పరిమిత నైపుణ్యాలతో ఎక్కువ పరుగులు సాధిస్తాడు. అతడు ప్రత్యర్థి జట్టులో భయం పుట్టిస్తాడు. తన సాహసోపేతమైన షాట్లతో మైదానం నలువైపులా ఫీల్డర్లను విస్తరించేలా చేస్తాడు. అయినా, అతడు పరుగులు సాధిస్తాడు. అది ఎలాంటి మ్యాచ్‌ అయినా దంచికొడుతూనే ఉంటాడు. అతడో ప్రత్యేకమైన ఆటగాడు. టీమ్‌ఇండియాకు నిలకడగా విజయాలు అందిస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకుంటాడు’ అని డీకే అభిప్రాయపడ్డాడు.

కాగా, పంత్‌ కొద్ది నెలలుగా నిజంగానే అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతడు ఆస్ట్రేలియా పర్యటనలో కీలక టెస్టుల్లో రెచ్చిపోవడంతో భారత్‌ వరుసగా రెండోసారి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నిలబెట్టుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ శతకంతో చెలరేగి మరోసారి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియాతో కలిసి సౌథాంప్టన్‌లో ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ పంత్‌ ఇలాగే చెలరేగి జట్టును విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని