రెండోసారి.. పంథా మారి - director and hero second combination
close
Published : 03/03/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండోసారి.. పంథా మారి

చిత్ర సీమలో, ప్రేక్షకుల్లో కాంబినేషన్లపై ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. దర్శకుడు, కథానాయకుడు కాంబోకు అది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓ దర్శకుడు-నటుడు కలిసి చేసిన తొలి చిత్రం హిట్‌ అందుకుంటే చాలు ఆ కలయికలో వచ్చే రెండో సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఆ జాబితాలో ఏ చిత్రాలున్నాయి? దర్శక-నటులెవరు? చూసేద్దాం...!

శివ-నాని

ర్శకుడు శివ నిర్వాణ, కథానాయకుడు నాని తమ కెరీర్‌లో ఎక్కువగా ప్రేమ కథల్నే ప్రేక్షకులకు చూపించారు. గతంలో ‘నిన్నుకోరి’తో అలరించిన ఈ జోడీ ఈసారి యాక్షన్‌ ప్యాక్‌తో రాబోతున్నారు. శివ-నాని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా ‘టక్‌ జగదీష్‌’. కుటుంబ కథా నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధం ఆవిష్కరించనున్నారు. ఎమోషన్‌కి ఎంత ప్రాధాన్యం ఉందో యాక్షన్‌ సన్నివేశాలకు అంతే ప్రాముఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ని చూస్తుంటే నాని లుక్‌ సైతం పవర్‌ఫుల్‌గా ఉంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. నాని-శివ కలయికలో వచ్చిన తొలి చిత్రం విజయం అందుకోవడంతో ‘టక్‌ జగదీష్‌’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


వెంకీ- శ్రీకాంత్‌ 

వెంకటేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కలిసి పనిచేసిన తొలి సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.  క్రేజీ మల్టీస్టారర్‌గా కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ కాంబోలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘నారప్ప’. ప్రియమణి నాయిక. తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘అసురన్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. కుటుంబ కథలకు కేరాఫ్‌గా నిలిచే శ్రీకాంత్‌ అడ్డాల ‘అసురన్‌’ని తెలుగులో తెరకెక్కించడం అటు పరిశ్రమ వర్గాల్ని, ఇటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సమాధానంగా గ్లింప్స్‌ విడుదల చేసి తానేంటో నిరూపించుకున్నారు శ్రీకాంత్‌. పోస్టర్లు సైతం ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి. సురేశ్‌ బాబు నిర్మిస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి ఎస్‌.థాను సమర్పిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.


రవితేజ- రమేశ్‌

‘వీర’తో తొలిసారి కలిశారు రవితేజ- రమేశ్‌ వర్మ. యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో వచ్చి ఆ చిత్రం పర్వాలేదనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఖిలాడి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్లే స్మార్ట్‌ అనేది ఉప శీర్షిక. గత చిత్రంలానే ఇందులోనూ యాక్షన్‌తోపాటు కామెడీ ఉండబోతుంది. రవితేజ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. రవితేజ ఫస్ట్‌లుక్‌ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మే 28న రాబోతున్నాడీ ఖిలాడి. 


పవన్‌- హరీశ్‌

వన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ ఈ కాంబినేషన్‌కి ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ‘గబ్బర్‌ సింగ్‌’తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది ఈ జోడీ. అంతటి సూపర్‌హిట్‌ తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో చిత్రానికి పనిచేస్తున్నారు.  ప్రకటన వెలువడటమే ఆలస్యం అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. కథేంటి? నాయిక ఎవరు? అంటూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఆ ఆసక్తిని అలాగే కొనసాగిస్తూ ‘పీఎస్‌పీకే 28’ వర్కింగ్‌ టైటిల్‌తో కథని పక్కాగా సిద్ధం చేస్తున్నారు హరీశ్‌. ‘గబ్బర్‌సింగ్‌’లా వినోదాన్ని పంచుతూనే సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కనుందీ ఈ క్రేజీ ప్రాజెక్టు.


తారక్‌- త్రివిక్రమ్‌

‘అరవింద సమేత’తో క్రేజీ కాంబినేషన్‌ జాబితాలో చేరారు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌. ఈ సినిమాలో త్రివిక్రమ్‌ తనదైన శైలిలో మాటలు వినిపిస్తూనే అదిరిపోయే యాక్షన్‌ చూపించి వావ్‌ అనిపించారు. మరోసారి ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందనడంతో తారక్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తొలి సినిమా ఘన విజయం అందుకోవడంతో ఈ కాంబోలో వస్తోన్న రెండో చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే అప్పుడు యాక్షన్‌ నేపథ్యంలో వచ్చారు ఈసారి రాజకీయ కోణంలో రాబోతున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని