Prabhas: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ - director gives clarity on prabhas hollywood entry
close
Published : 26/05/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ

దర్శకుడు ఏమన్నారంటే

హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌లన్నీ కూడా పాన్‌ఇండియా లెవల్‌లో విడుదల కానున్నవే. కాగా, హాలీవుడ్‌లో ఉన్న ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సరికొత్త పార్ట్‌లో ఓ కీ రోల్‌ పోషించనున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్తల గురించి స్పందించమని ఓ నెటిజన్‌ తాజాగా చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్‌కి ట్వీట్‌ చేశాడు.

‘మీరు తెరకెక్కిస్తున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-7’లో ఇండియన్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కీ రోల్‌ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు?’ అని నెటిజన్‌ కోరగా.. ‘ప్రభాస్‌ ఎంతో టాలెంట్‌ కలిగిన వ్యక్తి.  కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు’ అని క్రిస్టోఫర్‌ రిప్లై ఇచ్చారు. ఆయన పెట్టిన ట్వీట్‌తో ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. వీటి తర్వాత ఆయన నాగ్‌ అశ్విన్‌తో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని