వాదించటమే కాదు.. వాయించడమూ తెలుసు - director harish shankar in vakeel saab pre release event
close
Published : 04/04/2021 21:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాదించటమే కాదు.. వాయించడమూ తెలుసు

హైదరాబాద్‌: ఈ వకీల్‌సాబ్‌కు వాదించటమే కాదు, వాయించడమూ తెలుసు అని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అన్నారు. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ఆయన మాట్లాడారు. ‘లాక్‌డౌన్‌ తర్వాత కుదేలైన చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు వరుస సినిమాలు చేస్తున్న పవన్‌కల్యాణ్‌గారికి ధన్యవాదాలు. ‘‘ఆయన సినిమాను వదిలేద్దామనుకున్నా.. సినిమా ఆయన్ను వదలదు. చిత్ర పరిశ్రమలో ఎవరి సినిమా విజయం సాధించినా సంతోషపడే వ్యక్తి ఆయన. ఏప్రిల్‌ 9న విడుదలయ్యే ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నా’‌’ అని అన్నారు.

36 రోజులైంది మేం నిద్రపోయి..:తమన్‌

ఈ సినిమాలో సిగరెట్‌ వెలిగించుకునే పాటలు లేవని, ఇంట్లో దీపాలు వెలిగించుకునే పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. ‘‘వకీల్‌సాబ్‌’ చిత్రం కోసం రాత్రీ పగలూ పనిచేస్తున్నాం. మా టీమ్‌ సరిగ్గా నిద్రపోయి 36 రోజులైంది. పవన్‌కల్యాణ్‌గారి మొదటి ప్రసంగం నాకు ఎంతో ఇష్టం. అది వింటూనే ‘సత్యమేవజయతే’ పాట రికార్డు చేశాం. శ్రీకృష్ణ నాతో కలిసి మానసికంగా ఎంతో కష్టపడ్డాడు. ప్రతి పాట మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. అందుకు కారణం సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న నిర్మాత దిల్‌రాజు. అంతే అద్భుతంగా తెరకెక్కించే వేణు శ్రీరామ్‌ వల్లే సాధ్యమైంది’’ అని తమన్‌ చెప్పుకొచ్చారు.

అంతకుముందు నటి అనన్య మాట్లాడుతూ.. వకీల్‌సాబ్‌ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమని చెప్పారు. కొత్త నటిని కావడంతో షూటింగ్‌ సమయంలో పవన్‌కల్యాణ్‌ ఎంతో ప్రోత్సహించారని.. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్‌రాజులకు ధన్యవాదాలు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని