వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్‌ - director munna falls on stage at movie press meet
close
Published : 24/01/2021 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్‌

ప్రెస్‌మీట్‌లో అనుకోని ఘటన

హైదరాబాద్‌: పాటలు.. ప్రశంసలు.. స్పీచ్‌లతో ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతున్న ఓ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుకోనివిధంగా జరిగిన ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురయ్యేలా చేసింది. బుల్లితెర వ్యాఖ్యాతగా తన కామెడీ టైమింగ్‌, పంచులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రదీప్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’. లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది విడుదలకు నోచుకోని ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరికొన్ని రోజుల్లో తమ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ‘30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’ ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు మున్నా.. ముందు నుంచి తమ చిత్రానికి ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మీడియాకు, సినీ పరిశ్రమలో తనకు అండగా నిలిచిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్‌ మాట్లాడుతూ తమ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన అనూప్‌రూబెన్స్‌కు, ‘నీలినీలి ఆకాశం’ వంటి అద్భుతమైన పాటను అందించిన చంద్రబోస్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలోనే స్టేజ్‌పై హీరో వెనుక నిల్చొని ఉన్న దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్టేజ్‌పై ఉన్న ప్రదీప్‌, ఇతర చిత్రబృందం ఆయనకు మంచినీళ్లు అందించారు. అనంతరం స్టేజ్‌పై నుంచి దింపి ప్రథమ చికిత్స చేయించారు. పనిఒత్తిడి కారణంగానే మున్నా కళ్లు తిరిగి స్టేజ్‌పై పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని