‘వెన్నెల చిరునవ్వై’పై డైరెక్టర్‌ శంకర్‌ ప్రశంసలు - director shankar complements vennela chirunavvai
close
Published : 25/01/2021 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వెన్నెల చిరునవ్వై’పై డైరెక్టర్‌ శంకర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌: ‘అసలేం జరిగింది’ చిత్రంలోని ‘వెన్నెల చిరునవ్వై’ పాట చాలా బాగుందని, చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరామ్‌లోని మంచి అసలైన నటుడిని చూస్తున్నామని దర్శకుడు ఎన్‌.శంకర్ అన్నారు. ఎన్వీఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటుడు శ్రీరాం, సంచితా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించారు. ‘అసలేం జరిగింది’ చిత్రంలోని ‘వెన్నెల చిరునవ్వై’ పాటను శంకర్‌ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో జరిగిన విభిన్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. చిన్న సినిమాలు విడుదల చేయడానికిదే సరైన సమయం’ అని ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ మాట్లాడుతూ.. ఈ థ్రిల్లర్, సస్పెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏలెంద్ర మహావీర్ మనసు పెట్టి మంచి పాటల్ని అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకర్ రెడ్డి, సంగ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

అందుకే అక్టోబరు 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని