ఆ వార్తలు చూసి షాకయ్యా: డైరెక్టర్‌ శంకర్‌ - director shankar responds on non bailable warrent issue
close
Published : 02/02/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వార్తలు చూసి షాకయ్యా: డైరెక్టర్‌ శంకర్‌

చెన్నై: తనకు కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిందనే వార్తలపై డైరెక్టర్‌ శంకర్‌ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, కోర్టు ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఆ వారెంట్‌ జారీ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.

అందులో ‘ఎగ్మూర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు నాకు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిందనే వార్తలు చూడగానే షాక్‌కు గురయ్యా. వెంటనే మా లాయర్‌ సాయికుమారన్‌ ఈ విషయంపై కోర్టును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి ఎటువంటి వారెంట్‌ జారీ చేయలేదని తెలిపారు. ఆన్‌లైన్‌ కోర్టు రిపోర్టింగ్‌లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఆ నోటీసు జారీ అయినట్లు వివరించారు. వెంటనే దాన్ని సరిచేశారు. అయినా పూర్తి సమాచారాన్ని ధ్రువపరుచుకోకుండా ఒకరిపై తప్పుగా వార్తలు రాయడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వార్తలు నా బంధువులు, స్నేహితులను కలవరపాటుకు గురిచేశాయి. దయచేసి ఇకపై ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా, పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోబో’చిత్ర కథ విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’చిత్రం తెరకెక్కించే పనిలో శంకర్‌ ఉన్నారు. 

ఇవీ చదవండి!

డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

చెప్పాల్సింది వీళ్లే ..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని