టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుంది - director shekhar kammula byte about lovestory teaser
close
Published : 11/01/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుంది

హైదరాబాద్‌: ప్రేమ కథల స్పెషలిస్టు డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల. ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘లవ్‌స్టోరీ’. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమాకు నారాయణదాస్‌, రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. పవన్‌ సంగీతం అందించారు. దేవయాని, రావురమేశ్‌, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేశ్‌, తాగుబోతు రమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమా టీజర్ మంచిపేరు తెచ్చుకుంది. దీనిపై డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల మాట్లాడారు.

‘‘టీజర్‌కు మంచి స్పందన రావడం సంతోషాన్నిచ్చింది. టీజర్‌ ద్వారా సినిమాలోని పాత్రలను పరిచయం చేశాం. దాన్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. సినిమాను కూడా ఇదే విధంగా ఇష్టపడతారని ఆశిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. చిన్న ఊరు నుంచి పట్టణానికి వచ్చి బాగా స్థిరపడదామని అనుకున్న ఓ యువకుడి ప్రయత్నమే ఈ సినిమా. సినిమాలో హీరో పాత్ర నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. డైలాగ్స్‌, నటన.. ఇలా అన్ని విషయాల్లోనూ చైతన్య చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో మీరు కొత్త చైతన్యను చూస్తారు. సినిమా విడుదల కోసం మేం కూడా ఎదురుచూస్తున్నాం. కరోనాకు వ్యాక్సినేషన్‌ కూడా వస్తోంది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వస్తున్నారు. మేం కూడా సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. పరిస్థితిని బట్టి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను మళ్లీ థియేటర్లలో చూడటం చాలా ఆనందంగా ఉంది’’ అని శేఖర్‌ కమ్ముల అన్నారు.
ఇదీ చదవండి..

‘నరసింహనాయుడు’ కథ అలా పుట్టింది..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని