Virata Parvam: ఓటీటీ విడుదలపై డైరెక్టర్‌ క్లారిటీ - director venu udugula clarify virata parvam ott release
close
Published : 20/07/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virata Parvam: ఓటీటీ విడుదలపై డైరెక్టర్‌ క్లారిటీ

హైదరాబాద్‌: రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరాటపర్వం’ ఓటీటీలో విడుదలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఖండించారు. ‘విరాటపర్వం’ చిత్రాన్ని తప్పకుండా థియేటర్‌లోనే విడుదల చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. సినిమాకు మంచి ధర వచ్చిందని, దీంతో ఓటీటీకి విక్రయించారన్న వార్తల్లో నిజం లేదని తెలిపిన వేణు.. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.

రానా, సాయిపల్లవికి సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉందని, ఆ సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్ వీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. 1990లో మావోయిస్టు ఉద్యమంలోని పలు యథార్థ సంఘటనల ఆధారంగా వేణు విరాటపర్వాన్ని తీర్చిదిద్దారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని