Disha Patani: అదే చిత్ర ప‌రిశ్ర‌మ‌ను న‌డిపిస్తోంది - disha about ott
close
Published : 21/05/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Disha Patani: అదే చిత్ర ప‌రిశ్ర‌మ‌ను న‌డిపిస్తోంది

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓటీటీ న‌డిపిస్తోందని, చాలామందికి ఉపాధి అందిస్తోంద‌ని బాలీవుడ్ న‌టి దిశా ప‌టానీ అన్నారు. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ఆమె న‌టించిన ‘రాధే:యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం ఇటీవ‌ల ఓటీటీ జీ ప్లెక్స్‌లో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా డిజిట‌ల్ మాధ్య‌మం గురించి ఆమె త‌న అభిప్రాయం తెలియ‌జేశారు. ‘సాధార‌ణ రోజుల్లో సినిమాలు ఎంత గ్రాండ్‌గా విడుద‌ల‌వుతాయో.. అలా రాధే విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతో క‌ష్ట‌ప‌డి న‌టించిన‌ చిత్రాన్ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లి.. పండ‌గ‌లాంటి వాతావ‌ర‌ణం మధ్య విడుద‌లైతే ఆ సంతృప్తే వేరు. అయినా ఇలాంటి క‌ష్ట‌త‌ర‌మైన రోజుల్లో సినిమా విడుద‌ల కావ‌డ‌మే గొప్ప విష‌యం. ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటప్పుడు ఓటీటీ మంచి వేదిక‌గా నిలుస్తోంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌ని న‌డిపించే ఓ మార్గంగా క‌నిపిస్తోంది. ఎంద‌రికో ఉపాధిని కల్పిస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా  ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కి వెళ్లి సినిమాలు చూసేందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ ఓటీటీ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు డిజిట‌ల్ మాధ్య‌మం సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు’ అని పేర్కొన్నారు. ఈ భామ తెలుగులో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ‘లోఫ‌ర్’ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని