దిశను ఓకే చేశారా? - disha patani got the chance in bollywood chatrapathi remake
close
Published : 01/03/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిశను ఓకే చేశారా?

ముంబయి: తెలుగులో విజయవంతమైన పలు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. అందులో ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛత్రపతి’ ఒకటి. అక్కడ బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా దిశాపటానీ దాదాపుగా ఖాయమైనట్టే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

జాన్వీ కపూర్‌తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. దిశా హిందీతోపాటు, తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పూరి దర్శకత్వం వహించిన ‘లోఫర్‌’ సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని