ఆ సమస్య కాస్తైనా తగ్గుతుంది - disha patani spent the day at a farm
close
Published : 06/06/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సమస్య కాస్తైనా తగ్గుతుంది

ముంబయి: ‘‘పాడి పశువులను బాగా చూసుకుంటే.. దేశంలో కొంత ఆహార కొరత తీర్చవచ్చు’’ అంటోంది అందాల భామ దిశాపటాని. ఇటీవలే ఆమె పాడిపశువుల పెంపక కేంద్రానికి వెళ్లి కాసేపు అక్కడ గడిపి వాటి విశేషాలు తెలుసుకొంది. ‘‘పాలు, పాల ఉత్పత్తుల వినియోగం బాగా పెరిగిపోయింది. లాక్‌డౌన్‌లో ఇది మరింత ఎక్కువైంది. అయితే పాల ఉత్పత్తిదారుల సంఖ్య తగ్గుతోంది. రైతులంతా రెండో ఉపాధిగా పాడి పశువుల పెంపకాన్ని చేపడితే వారికి అదనపు ఆదాయం వస్తుంది. దేశంలో ఆహార కొరత కొంతవరకూ తీరుతుంది. యువత దీనిపై దృష్టి పెడితే మరిన్ని అద్భుతాలు చూడొచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ‘లోఫర్‌’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ భామ తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్‌తో ‘భారత్‌’, టైగర్‌ష్రాఫ్‌తో ‘భాగీ-2’ల్లో అలరించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన సల్మాన్‌ఖాన్‌ చిత్రం ‘రాధే’లో మెరిసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని