34 మందితో తమిళనాడు మంత్రివర్గం - dmk issues list of 34 ministers tamil nadu cmelect stalin gets home
close
Published : 06/05/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

34 మందితో తమిళనాడు మంత్రివర్గం

ప్రకటన విడుదల చేసిన డీఎంకే

చెన్నై: తమిళనాడు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ  నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల  విజయం సాధించిన డీఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే గురువారం ప్రకటన విడుదల చేసింది.  వీరంతా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. హోంశాఖతో పాటు సంక్షేమశాఖ, జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ తదితర పోర్టుఫోలియోలను స్టాలిన్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల నియామకాలు, బదిలీలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. మరోవైపు స్టాలిన్‌ తనయుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధికి మాత్రం తాజా మంత్రుల జాబితాలో స్థానం దక్కలేదు. అయితే భవిష్యత్‌లో మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? ఇదే మంత్రులు ఉంటారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని