ఒత్తిడి అనిపిస్తోందా.. ఈ యాప్‌ ట్రై చేయండి - do you know about antistress app
close
Published : 24/05/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తిడి అనిపిస్తోందా.. ఈ యాప్‌ ట్రై చేయండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనసులో ఒత్తిడి అనిపిస్తోందా? చాలాసేపు నుంచి అదే పని చేస్తూ చిరాకుగా ఉందా? మనసు వేరే విషయం మీదకు మళ్లించాలా? ఇలాంటి చాలా పనులకు ఓ యాప్‌ ఉంది తెలుసా? ఆ యాప్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉన్న చిన్న చిన్న టాస్క్‌లు, గేమ్స్‌ ఆడితే తప్పకుండా మీలో మార్పు కనిపిస్తుంది. అందులో ఏం టాస్కులు ఉంటాయో అని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే అందులో ఉండే పనులు మనం నిత్య జీవితంలో చూసినవే, ఎప్పుడో ఒకసారి చేసినవే. 

ఆ యాప్‌ గురించి కొన్ని విషయాలు చెబుతాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌ అర్థమవుతుంది. కొంతమందికి ఒత్తిడిగా అనిపిస్తే పెన్‌ స్విచ్‌ను టపటపా నొక్కుతూ ఉంటారు. రాపర్‌లోని బబుల్స్‌ను పేలుస్తుంటారు. ఏదో స్విచ్‌ దొరికితే ఆన్‌/ఆఫ్‌ చేస్తుంటారు. పెన్ను తీసుకొని ఏదో ఒకటి రాసేస్తుంటారు. ఏదైనా బొమ్మను అలా గాల్లో ఎగరేస్తుంటారు. విడ్జెట్‌ స్పిన్నర్‌ను తిప్పుతా ఉంటారు. వీటిలో మీరు కూడా కొన్ని చేసుంటారు. అవునా... ఇలాంటివి అన్నీ ఆ యాప్‌లో ఉన్నాయి. అదీ మేటర్‌!

ఆ యాప్‌ పేరు ‘యాంటీ స్ట్రెస్‌’ ( Antistress) ఈ యాప్‌లో  రెండు రకాల టాస్క్‌/గేమ్స్‌ ఉంటాయి. ఒకటి ఉచితంగా ఆడుకునేవైతే... ఇంకొన్ని (క్వైట్‌ ప్యాక్‌) డబ్బులు కట్టి ఆడుకోవచ్చు. అయితే గేమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తొలిరోజుల్లో ఒక యాడ్‌ చూస్తే క్వైట్‌ ప్యాక్‌లో గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఇందులో గేమ్స్‌తోపాటు మనసుకు హాయిగొలిపే సంగీతం, కిలకిలారావాలు లాంటివి కూడా ఉన్నాయి.  కావాలంటే  ఈ లింక్‌ను క్లిక్‌ చేసి గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్ని టాస్క్‌లు/గేమ్స్‌ చూస్తే మీకు మీ చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని