‘కేజీయఫ్‌’ హీరోకి ఉన్న కార్లెన్నో తెలుసా? - do you know how many cars for the kgf hero
close
Updated : 27/02/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీయఫ్‌’ హీరోకి ఉన్న కార్లెన్నో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్: కన్నడ కథానాయకుడు యశ్‌ ‘కేజీయఫ్‌’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘కేజీయఫ్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌2’లో నటిస్తున్నారు. యశ్‌కి కార్లంటే చాలా ప్రేమ. అందుకే ఆయన దగ్గర ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ‘కేజీయఫ్‌2’ సినిమా టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రతినాయకుడు అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా..రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని దక్షిణాదితో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా జులై 16, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని