మహేశ్‌బాబు వాట్సాప్‌ డీపీ ఏంటో తెలుసా..? - do you know mahesh babus whatsapp dp
close
Published : 16/03/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబు వాట్సాప్‌ డీపీ ఏంటో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా వాట్సాప్‌ వినియోగించే వాళ్లలో చాలామంది తమ ఫొటోలను వాట్సాప్‌ డీపీ(డీస్‌ప్లే పిక్చర్‌)లుగా పెట్టుకుంటారు. ఇంకొంత మంది తమకు ఇష్టమైన వాళ్ల ఫొటోలు పెడతారు. సినిమా అభిమానుల విషయానికి వస్తే తాము అభిమానించే హీరోలు.. నటుల ఫొటోలను తమ వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మరి ఆ సినిమా స్టార్లు ఎవరి ఫొటోలు డీపీలుగా పెట్టుకుంటారు..? అని అడిగితే.. అది తెలుసుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే.. తమ అభిమాన హీరోలకు సంబంధించింది చిన్న విషయమైనా.. అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానులకు ఎప్పుడూ ఉంటుంది. తాజాగా.. బయటపడిన ఓ వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌తో మహేశ్‌బాబు డీపీ ఏంటో తెలిసిపోయింది. వేటకు సిద్ధంగా ఉన్న ‘సింహం’ చిత్రాన్ని ఆయన తన వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నారు. ఇంతకీ ఇది ఎలా బయటపడిందో తెలుసా..?

నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల చిత్ర టీజర్‌ విడుదలైంది. దానికి చిరంజీవి, మహేశ్‌బాబు నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. టీజర్‌ బాగుందని.. వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ వాట్సాప్‌లో నాగార్జునకు శుభాకాంక్షలు చెప్పారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సదరు వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను నాగార్జున ట్విటర్‌లో పంచుకున్నారు. కాగా.. ఇందులో మహేశ్‌బాబు వాట్సాప్‌ డీపీలో ‘సింహం’ కనపడుతోంది.. చిరు మాత్రం అసలు ఏ ఫొటోను డీపీగా వాడలేదు. ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారువారి పాట’లో నటిస్తున్నారు. పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని