‘డాక్టర్‌ జీ’గా మీ ముందుకు వస్తున్నా! - doctor g first look presenting ayushmann khurrana as dr uday gupta
close
Published : 19/07/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డాక్టర్‌ జీ’గా మీ ముందుకు వస్తున్నా!

బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా

యువ కథానాయకుల్లో విభిన్న పాత్రలతో, కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్‌ ఖురానా. రెగ్యులర్‌ కమర్షియల్‌ కథలకు దూరంగా ఆయన చిత్రాలు ఉంటాయి. గతంలో అంధాధున్‌, బాలా, గులాబో సితాబో, ఆర్టికల్‌ 15 చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఆయన ఈసారి డాక్టర్‌ అవతారమెత్తారు. ఆయన తదుపరి చిత్రం ‘డాక్టర్‌ జీ’లో వైద్యుడిగా కనిపించినున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ 36ఏళ్ల కథానాయకుడు. ల్యాబ్‌కోట్‌ ధరించి, చేతిలో గైనకాలజీ పుస్తకంతో డాక్టర్‌ ఉదయ్‌గుప్తా అంటూ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి.. ‘‘డాక్టర్‌ జీ ! షూటింగ్‌కు సిద్ధమయ్యాడు’’ అంటూ క్యాప్షన్‌ని జత చేశాడు. కాలేజీ క్యాంపస్‌ కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ హౌస్ నిర్మిస్తుంది. ‘మహమ్మారి కరోనా వేళ నేను నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రం స్క్రిప్ట్‌  నన్నెంతో ఆకట్టుకుంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్‌. జంగ్లీ పిక్చర్స్‌ సంస్థతో ఆయనకిది మూడో చిత్రం. గతంలో ఈసంస్థ నిర్మించిన చిత్రాల్లో 2017లో ‘బరేలీ కి బర్ఫీ ’, 2018లో ‘బదాయి హో’ నటించారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని