కొవిడ్ రోగి మృతి.. వైద్యులపై కర్రలతో దాడి! - doctors nurses attacked in delhi hospital
close
Published : 27/04/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ రోగి మృతి.. వైద్యులపై కర్రలతో దాడి!

దిల్లీ: కరోనా ఉగ్రరూపంతో దేశ రాజధాని నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోగుల తాకిడితో ఆస్పత్రుల్లో బెడ్‌లు కొరత, ఆక్సిజన్‌ కొరత వంటి సమస్యలు వేధిస్తున్న వేళ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో మృతిచెందిన ఓ మహిళ బంధువులు ఆస్పత్రి వైద్య సిబ్బందిపై దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటన దిల్లీలోని సరిత విహార్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొవిడ్‌తో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళను సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసీయూ బెడ్‌ కోసం ఆమెను ఎమర్జెన్సీ ఏరియాలో ఉంచారు. అయితే, ఆమెకు ఐసీయూ బెడ్‌ దొరకకపోవడంతో మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులు, నర్సులపై దాడికి దిగారు. ఆస్పత్రి బయట కర్రలతో కొట్టి, పలు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని