‘లక్ష్మీ బాంబ్‌’ ఆడితే.. అది లారెన్స్‌ వల్లే..! - donning a saree is very difficult says akshay kumar
close
Published : 24/10/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లక్ష్మీ బాంబ్‌’ ఆడితే.. అది లారెన్స్‌ వల్లే..!

చీర కట్టుకోవడం ఎంతో కష్టం: అక్షయ్‌

ముంబయి: సినిమాలోని పాత్ర డిమాండ్‌ మేరకు ఇప్పటికే అనేక మంది నటులు చీర కట్టి వెండితెరపై వినోదం పంచారు. బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ కూడా మొదటి సారి చీరలో దర్శనమివ్వబోతున్నారు. ‘లక్ష్మీ బాంబ్‌’లో చీర, బొట్టు, పొడవైన జుట్టు, గాజులతో కనిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అక్షయ్‌ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘చీర గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అందమైన ఔట్‌ఫిట్‌. ‘లక్ష్మీ బాంబ్‌’ కోసం చీర కట్టుకోవడం నాకు ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చింది. నిజం చెప్పాలంటే.. చీర కట్టుకోవడం అత్యంత కష్టం. ఆరంభంలో చీరతో కెమెరా ముందు షూటింగ్‌ చేస్తుంటే దానంతట అదే ఊడిపోయేది. చీరలో డ్యాన్స్‌, ఫైటింగ్‌ చేయడాన్ని పక్కనపెడితే.. సరిగ్గా ముందుకు అడుగులు కూడా వేయలేం. షూటింగ్‌ బ్రేక్‌లో ప్రతిసారి నా వద్దకు వచ్చి సరిచేసిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అందరూ జీవితంలో ఒక్కసారైనా చీర కట్టుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు అందులోని కష్టం అర్థమౌతుంది’ అని అన్నారు.

అనంతరం ఈ పాత్ర పోషించడం ఎలా ఉందని ప్రశ్నించగా.. ‘నా 30 ఏళ్ల కెరీర్‌లో.. ‘లక్ష్మి’ పాత్ర మానసికంగా ఎంతో సున్నితమైంది. నా వంతు శ్రమించి, అందులో నటించా. ఈ పాత్ర ఎలా మాట్లాడుతుంది, నడుస్తుంది, డ్యాన్స్‌ చేస్తుంది.. తదితర విషయాలను నాకు వివరించిన రాఘవా లారెన్స్‌కు ధన్యవాదాలు. నేను కేవలం ఆయన్ను ఇమిటేట్‌ చేశా. ఈ సినిమా చక్కగా ఆడితే అది కేవలం ఆయన వల్లే’ అని అక్షయ్‌ చెప్పారు.

‘కాంచన’ సినిమాకు హిందీ రీమేక్‌ ‘లక్ష్మీ బాంబ్‌’. మాతృకను తీసి, నటించిన లారెన్స్‌ దీన్ని కూడా రూపొందించారు. కియారా అడ్వాణీ కథానాయిక. కొన్ని మార్పులతో హిందీ ప్రేక్షకులకు తగ్గట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌లోలో సినిమా విడుదల కాబోతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని