నా కోసం స్టంట్స్‌ మార్చొద్దు: సంజయ్‌ దత్‌ - dont insult me says sanjay dutt
close
Published : 31/12/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కోసం స్టంట్స్‌ మార్చొద్దు: సంజయ్‌ దత్‌

హైదరాబాద్‌: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ 2’. భారీ వసూళ్లను రాబట్టి.. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన యాక్షన్, పవర్‌ఫుల్ డ్రామా ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో రానున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ సెట్లోకి ఇటీవల బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చారు. అయితే దానికి సంజయ్‌ నిరాకరించారని సమాచారం.

స్టంట్ల మార్పు గురించి సంజయ్‌ దత్‌ స్పందిస్తూ.. ‘‘యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పని విషయంలో ఎలాంటి రాజీపడేది లేదు’’ అని అన్నారట. కథానాయకుడు యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని