Double mask.. రక్షణ మెండు! - double mask safer
close
Updated : 20/04/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Double mask.. రక్షణ మెండు!

దిల్లీ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముఖానికి రెండు మాస్కులు ధరించడం ప్రయోజనకరమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల కరోనా వైరస్‌ పరిమాణంలోని రేణువులను వడకట్టే సామర్థ్యం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. వీటిని ధరించిన వారి ముక్కు, గొంతులోకి అవి ప్రవేశించకుండా చాలావరకూ రక్షణ లభిస్తుందని తెలిపారు. అయితే ఈ మాస్కులు.. ముఖంపై దృఢంగా అమరేలా ఉండాలన్నారు. ‘‘రెండు ముఖ తొడుగులు అంటే.. ఒక మాస్కుకు మరో పొరను జోడించడం కాదు. అవి ముఖానికి సరిగా అమరేలా చూసుకోవాలి. ఎక్కడా ఖాళీ లేకుండా పూర్తిగా కప్పేసేలా ఉండాలి’’ అని చెప్పారు. ఉత్తర కరోలైనా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ సిక్‌బెర్ట్‌ బెనెట్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. సర్జికల్‌ మాస్కులను చాలా ఎక్కువ వడపోత సామర్థ్యం ఉండేలా డిజైన్‌ చేశారని ఆమె తెలిపారు. అయితే అవి మన ముఖాలకు సరిగా అమరవని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో వివిధ రకాల మాస్కులు సామర్థ్యాన్ని పరీక్షించినట్లు తెలిపారు. తల వంచడం, మాట్లాడటం, తల పక్కకు తిప్పి చూడటం వంటి సాధారణ చర్యలను అనుకరించి, ఆ సమయంలోనూ మాస్కుల సామర్థ్యాన్ని పరిశీలించామన్నారు. ఒక వ్యక్తి ముఖానికి అనుగుణంగా మార్పులు చేయని మాస్కులు.. కరోనా వైరస్‌ పరిమాణంలోని రేణువులను వడకట్టడంలో 40-60 శాతం సమర్థతను ప్రదర్శించాయని చెప్పారు. వస్త్రంతో చేసిన ముఖ తొడుగు 40 శాతం సమర్థతతో పనిచేస్తోందని వివరించారు. అయితే ఒక సర్జికల్‌ మాస్కుపై వస్త్రం మాస్కును పెట్టుకుంటే.. వడపోత సామర్థ్యం 20 మేర పెరుగుతున్నట్లు తేల్చారు. ఈ విధానం వల్ల ముఖంపై ఖాళీలు లేకుండా బిగుతుగా సర్జికల్‌ మాస్కు అమరిందని తెలిపారు. అలాగే.. వస్త్రంతో చేసిన మాస్కుపై సర్జికల్‌ మాస్కును పెట్టుకున్నప్పుడు వడపోత సామర్థ్యం 16 శాతం మేర పెరిగినట్లు వివరించారు. అయితే వదులుగా ఉండే రెండు ముఖ తొడుగులను ధరించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని