కాఫీ తాగేముందు ఆలోచించు గురూ! - drinking too much coffee linked to dementia stroke risk study
close
Updated : 25/07/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాఫీ తాగేముందు ఆలోచించు గురూ!

ఆరు కప్పులకు పైగా కాఫీ తాగితే మెదడుకు ముప్పే

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’..  ‘ఆనంద్‌.. మంచి కాఫీ లాంటి సినిమా’.. అంటూ కాఫీ గురించి ఇన్నాళ్లు తియ్యగా మాట్లాడుకున్నాం. ఇకపై కాఫీ అతిగా తాగితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి తాజా అధ్యయానాలు. మతిమరుపు, భాష మర్చిపోవడం, ఆలోచనా విధానం మందగించడం వంటి సమస్యలకు దారి తీస్తుందని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. వైద్య భాషల్లో దీన్నే ‘డెమెన్షియా’గా సంబోధిస్తారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ర్టేలియాలో పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం..  రోజుకి ఆరు, ఆపై కప్పుల కాఫీ తాగేవారిలో డెమెన్షియా వ్యాధి ముప్పు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించి  17,702 మంది (37-73 వయసు) ఉన్నవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఆపై కాఫీ తాగడం వల్ల మెదడుకు కలిగే దుష్ర్పభావాలను పరిశీలించారు. అతిగా కాఫీ తీసుకునే వారిలో ఈ అనారోగ్యానికి దారి తీసినట్లు వారి ఫలితాల్లో తేలింది. ఈ వ్యాధి బారిన పడినట్లైతే.. రోజు చేసే పనుల మీద ప్రభావం చూపడమే కాదని.. ఒక్కోసారి మరణానికి సైతం దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచో) గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5కోట్ల మందికి డెమెన్షియాతో బాధపడుతున్నారని.. 2030 నాటికి ఈసంఖ్య.. 8కోట్లు, 2050 నాటికి 10కోట్లపైకి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాణాంతకరమైన ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స అందుబాటులో లేదని, కాబట్టి నియంత్రణలో ఉండటమే మంచిదని డబ్యూహెచో సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని