అదే ఉత్కంఠ: ‘దృశ్యం2’ ట్రైలర్‌ చూశారా? - drishyam 2 official trailer malayalam
close
Published : 07/02/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే ఉత్కంఠ: ‘దృశ్యం2’ ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌లాల్‌ కథానాయకుడిగా మలయాళంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘దృశ్యం’. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టిందా సినిమా. అంతేకాదు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్‌ అయి ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా మలయాళంలో ‘దృశ్యం2’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దృశ్యం’లో క్లోజ్‌ అయిపోయిన కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేశారా?లేక ఇది ఇంకో సమస్యా?అయితే, అదేేంటి? మరి ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అందుకు జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్‌) ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు ఆగాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని