Drunk and Drive: మద్యం మత్తులో వాహనం నడిపితే.. - drunk driving can influence your concentration and reduce your attention span
close
Published : 24/07/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Drunk and Drive: మద్యం మత్తులో వాహనం నడిపితే..

హైదరాబాద్‌: రహదారుల మీద నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ పలువురు ఆస్పత్రి పాలవుతుండగా, ఇంకొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విషయంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 11న మాదాపూర్‌, కావూరి హిల్స్‌ రోడ్డులో జరిగిన ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో బైక్‌ నడుపుతూ నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతున్నారు. ఇంతలో అటుగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ మీదున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మద్యం తాగి వాహనం నడపడం ఎంత ప్రమాదమో తెలియజేస్తూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని