ఓటీటీలోనే దృశ్యం-2  - drushyam2 teaser out now
close
Published : 01/01/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలోనే దృశ్యం-2 

తిరువనంతపురం‌: మలయాళీ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘దృశ్యం-2’ టీజర్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

‘సార్‌.. పోలీసుల్ని నేను తక్కువభావనతో చూడడం లేదు. సమాజంలో ఉన్న ప్రజలను వాళ్లు సంరక్షిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు, మీ పోలీస్‌స్టేషన్‌ నాకు సంరక్షణ ఇవ్వాలి’ అంటూ మోహన్‌లాల్‌ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్‌ను తీర్చిదిద్దారు. జితూ జోసఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనా కీలకపాత్రను పోషిస్తున్నారు.

ఇవీ చదవండి

కొత్త ఏడాదిలో సరికొత్త సినిమాలు.. వచ్చేస్తున్నాయ్‌

కలలన్నీ నిజం కావాలి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావాలి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని