close
Published : 04/05/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

The Rock: నువ్వు అమ్మాయివా..? అనేవారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్వేన్‌ జాన్సన్‌ (ది రాక్‌) కండలు తిరిగిన దేహంతో ఉండే హాలీవుడ్‌ నటుడు.. గతంలో రెజ్లర్‌ అనే విషయం చాలామందికి తెలుసు. అయితే.. రాక్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం శారీరకంగా ఎంతో దృఢంగా కనిపిస్తున్న రాక్‌ పాఠశాలకు వెళ్లే రోజుల్లో చాలా మృదువుగా ఉండేవాడట. అందుకే చాలా మంది అతడిని ఆటపట్టించేవారట. తనను ఆడపిల్ల అనుకొని పొరబడేవారని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

చిన్నతనంలో ఒకసారి పాఠశాల బస్సులో ఎక్కి ఒక అబ్బాయి పక్కనే కూర్చోగా.. వెంటనే ఆ అబ్బాయి.. ‘నేను నిన్ను ఒకటి అడగొచ్చా..?’ అన్నాడట. దానికి అడగండి అని రాక్‌ స్పందించగా.. ‘నువ్వు అమ్మాయివా..? అబ్బాయివా..?’ అని అనుమానం వ్యక్తం చేశాడట. అయితే.. 7 నుంచి 11 ఏళ్ల వయసు మధ్యకాలంలో తాను ఎంతో మృదుస్వభావం కలిగి ఉండటంతో పాటు తన జుట్టు కూడా అమ్మాయి జుట్టులా ఎంతో మెత్తగా ఉండటమే ఇందుకు కారణమని రాక్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి రెజ్లర్‌ కావడంతో చిన్నతనంలో తరచూ పాఠశాలలు మారుతూ రావాల్సి వచ్చేదట. అలా దాదాపు 13 పాఠశాలలు మారినట్లు రాక్‌ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం డ్వేన్ జాన్సన్ విలన్‌గా నటించిన ‘బ్లాక్ ఆడమ్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రాక్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. వీటితో పాటు ‘జంగిల్‌ క్రూజ్‌’, ‘రెడ్‌ నోటీస్‌’ చిత్రాల్లోనూ రాక్‌ నటించాడు. అవి కూడా చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని