Home Isolationలో ఉన్నారా.. ఇవి తినండి - eat these balanced diet food after test positive with covid
close
Published : 28/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Home Isolationలో ఉన్నారా.. ఇవి తినండి

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణ జ్వరం వస్తేనే నోరంతా చేదుగా మారి ఏమీ తినాలనిపించదు. అలాంటిది కరోనా సోకితే.. జ్వరం, ఒళ్లునొప్పులతో పాటు రుచి, వాసన కోల్పోయిన తిండి అస్సలు సహించదు. అలా అని తినడం మానేస్తే.. బలహీనంగా మారుతాం. అది వైరస్‌కు మరింత అనుకూలంగా మారి మరింత ప్రభావం చూపిస్తుంది. అందుకే మందులతో పాటు క్రమం తప్పకుండా సమతుల ఆహారం కూడా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యులు సూచించిన ఔషధాలతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటే ఇంట్లోనే కొవిడ్‌ను జయించొచ్చని చెబుతున్నారు. మరి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

* కొవిడ్‌ నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, అన్‌శాచ్యూరేటెడ్‌ ఫ్యాట్‌ తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం చేపలు, ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు. చికెన్‌ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు.

* విటమిన్‌ సి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు కనీసం రెండు సార్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.  

* ఎండు ఫలాలు(డ్రైఫ్రూట్స్‌), బెల్లం, నువ్వులు, నెయ్యితో కలిపి చేసిన లడ్డూలు రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన జింక్‌, మెగ్నీషియం, మాంగనీస్‌ అందుతాయని వైద్యులు చెబుతున్నారు. 

* కరోనా వచ్చిన వారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం.. శరీరాన్ని ఎప్పుడూ డీహైడ్రేట్‌ కానివ్వొద్దు. కనీసం రోజుకు 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. దీంతో పాటు కొబ్బరి నీళ్లు రెండు పూటలా తీసుకోవాలని న్యూట్రీషన్‌ వైద్యులు చెబుతున్నారు. అయితే శీతల పానీయాలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది.

* ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కంటే కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం మేలని డాక్టర్లు అంటున్నారు. కొద్దికొద్దిగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది సార్లు తినాలి. ఆహారంలో నెయ్యి, బెల్లం ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో చేసిన కిచిడీ.. ఫర్మెంటెడ్‌ రైస్‌(పుల్లబెట్టిన ఆహారం లేదా చద్దన్నం) వంటివి తీసుకోవాలి.

ఈ డైట్‌తో పాటు వేడి నీటిలో ఉప్పు వేసి గార్గిల్‌ చేసుకోవడం, రోజుకు మూడు సార్లు ఆవిరిపట్టడం చేయాలి. వీటన్నింటితో పాటు ప్రాణాయామం, మంచి నిద్ర.. వైరస్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని