‘Oxygenలేక చనిపోవడం దేశానికే అవమానం’ - eatala comments on oxygen and vaccine deficiency
close
Published : 29/04/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘Oxygenలేక చనిపోవడం దేశానికే అవమానం’

మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: కరోనా సమయంలో ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని ఆయన కోరారు. వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి  యుద్ధ ప్రాతిపదికన పెరగాలన్నారు. వ్యాక్సిన్‌ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘‘18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి 3.5కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ప్రణాళికను ప్రకటించాలి. ఉచితంగా టీకా ఇవ్వాలి’’ అని కోరారు.

అన్నీ కేంద్రం చేతుల్లో.. రాష్ట్రాలపై ఆరోపణలా?

‘‘భాజపా నేతలు బాధ్యతారహిత్యంతో మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స జరుగుతోంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నోస్టిక్స్‌ హబ్‌లు ప్రారంభమవుతాయి. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి జిల్లా డయాగ్నోస్టిక్స్‌ రక్త పరీక్షలు నిర్వహిస్తాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు 3, 4 రోజులకోసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కావాలని కేంద్రాన్ని అడిగాం.కానీ, 306 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించారు. రాష్ట్రానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాలని కోరాం’’ అని చెప్పారు.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని