బెంగాల్‌: అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపు - ec calls all party meet on friday
close
Published : 14/04/2021 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌: అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపు

కోల్‌కతా: బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ ఉద్ధృతిపై కలకత్తా హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలకు ఉపక్రమించింది. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపునిచ్చింది. శుక్రవారం సమావేశం జరగనుండగా.. దీనికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు హాజరుకానున్నారు. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన కరోనా జాగ్రతలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మిగిలిన దశల ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలకు కొవిడ్‌ నిబంధనలపై ఈసీ కఠిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని