బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు - edible oil prices surge to highest level in over a decade
close
Published : 26/05/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు

దిల్లీ: దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా ఆవనూనె, వనస్పతి, సోయా, పామ్‌, పొద్దుతిరుగుడు, వేరుశెనగ మొదలైన వంటనూనెల ధరలు పెరిగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న వంటనూనెల ధరల వల్ల వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. 

స్థానిక ధరలలో ‘అసాధారణ పెరుగుదల’ సమస్యను పరిష్కరించడానికి ఆహార, ప్రజా పంపిణీ శాఖ సోమవారం పరిశ్రమల యజమానులతో సమావేశమయ్యింది. పెరుగుతున్న వంటనూనెల ధరలను తగ్గించేందుకు మార్గాలను ఆన్వేషించాలని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వివిధ రాష్ట్రాల్లోని పారిశ్రామికాధిపతులను కోరారు. దేశీయంగా వంటనూనె ధరల్లో 62 శాతం పెరుగుదల ఉందని పాండే తెలిపారు. దేశంలో నూనెగింజల ఉత్పత్తి, లభ్యత డిమాండ్‌ కంటే తక్కువగా ఉండటమే ధరల పెరుగుదలకు కారణమని ధ్రువీకరించారు. ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో వంటనూనెలు దిగుమతి అవుతాయి. అంతర్జాతీయంగా వంటనూనెల ధరల్లో వచ్చే మార్పులు దేశంలో వంటనూనెల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధరలతో పోల్చితే దేశంలో వంటనూనెల ధరలు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. దేశీయ అవసరాలలో 60 శాతానికి పైగా వంటనూనెల్ని దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయంగా వంటనూనెల ధరల ప్రభావం భారత దేశంలో వాటి ధరలను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం వంటనూనె ధరలు వేరుశెనగ నూనె కిలో రూ.175, వనస్పతి రూ.129, సోయా రూ. 148, సన్‌ఫ్లవర్‌ రూ.169 గా ఉన్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని