దీపావళి రేసులో రజనీ, కమల్‌ - eenadu
close
Published : 11/04/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళి రేసులో రజనీ, కమల్‌

చెన్నై: రజనీకాంత్, కమల్‌హాసన్‌... తమిళ సూపర్‌స్టార్లు ఇద్దరూ దీపావళికి బాక్స్‌ఫీసు వద్ద పోరుకు సిద్ధమవుతున్నారా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే రజనీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాత్తై’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో తలైవా గ్రామాధ్యక్షుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత చిత్రీకరణ కోసం రజనీ హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడి రామోజీఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వేగంగా షూటింగ్‌ పూర్తిచేసి... తదనంతర పనులు చేపట్టాలని ఈ బృందం ప్రణాళికతో ఉంది. మరోవైపు కమల్‌హాసన్‌-లోకేశ్‌ కనగరాజ్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘విక్రమ్‌’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని సంకల్పించారు. తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ పూర్తి అయిన వెంటనే కమల్‌ దీనికోసం రంగంలోకి దిగారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జోరుగా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమానీ దీపావళి రేసులో నిలపాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. ఇదే నిజమైతే తమిళనాట ఇద్దరూ అగ్ర కథానాయకుల చిత్రాలతో అభిమానులు హోరెత్తనున్నారు. ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ ఇద్దరూ బాక్స్‌ఫీసు వద్ద తలపడ్డారు. రజనీ నటించిన      ‘చంద్రముఖి’, కమల్‌ ‘ముంబయి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాలు 2005 తమిళ సంవత్సరాదికి పోటీపడి అభిమానులను అలరించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని