పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో - eesha rebba rejected gunsekhar shakuntalam due to less remuneration
close
Published : 06/03/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో

త్వరలో పట్టాలెక్కనున్న అపురూప ప్రేమకావ్యం

హైదరాబాద్‌: వరుసగా తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఈషారెబ్బా. ‘అంతకు ముందు.. ఆ తరువాత..’, ‘అ!’, ‘బ్యాండ్‌బాబు’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి గురించి ప్రస్తుతం నెట్టింట్లో మాట్లాడుకుంటున్నారు. తక్కువ పారితోషికం ఆఫర్‌ చేశారని ఈ చిన్నది ఓ భారీ ప్రాజెక్ట్‌ రిజక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ సినిమా ఏమిటంటే.. ‘శాకుంతలం’.

గుణశేఖర్‌ దర్శకత్వం వహించనున్న అపురూప ప్రేమకావ్యం ‘శాకుంతలం’. సమంత ప్రధాన పాత్రలో నటించనున్న ఈ ప్రాజెక్ట్‌ పనులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. కాగా, త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం చిత్రబృందం ఈషారెబ్బాని సంప్రదించిందట. అయితే, పాత్ర నచ్చినప్పటికీ.. పారితోషికం తక్కువగా ఉండటంతో ఆమె సున్నితంగా తిరస్కరించారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని