‘పాగల్‌’ పాడిన సింగిల్‌ చిన్నోడు - eesinglechinnode lyrical paagal songs vishwak sen
close
Published : 02/06/2021 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాగల్‌’ పాడిన సింగిల్‌ చిన్నోడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథాంశాలను ఎంచుకొంటూ యువతలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఈ యువ హీరో నటించిన ‘హిట్‌’ మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వక్‌ నుంచి తొలిసారిగా వస్తున్న ప్రేమ కథా చిత్రం ‘పాగల్‌’. ఈ చిత్రానికి సురేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో విశ్వక్‌ మునుపటికి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. నివేదా పేతురాజ్‌, సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గూగుల్‌’ పాట కుర్రకారును హోరెత్తించింది. తాజాగా చిత్రబృందం మరో పాట విడుదల చేసింది. ‘ఈ సింగిల్‌ చిన్నోడు’ అంటూ సాగే ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను కృష్ణకాంత్‌ రచించగా.. రాధన్‌ సంగీతం అందించారు. బెన్నీ ఆలపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని