ఈ-ఓటింగ్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు - election commission working with iit-madras on blockchain technology for e-voting
close
Published : 26/03/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ-ఓటింగ్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: మారుమూల ప్రాంత ప్రజలు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఎన్నికల్లో ఓటేసే సౌలభ్యం (ఈ-ఓటింగ్‌) అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి దీన్ని తీసుకొచ్చేందుకు భారత ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం బ్లాక్‌ ఐఐటీ- మద్రాస్‌తో కలిసి బ్లాక్‌చైన్‌ సాంకేతికత అంశంపై పనిచేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకడామీలో శుక్రవారం జరిగిన ప్రొబేషనర్‌ ఐపీఎస్‌ అధికారులతో సంభాషించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్నికల ప్రక్రియలో పలు మార్పులు జరగబోతున్నాయని ఈ సందర్భంగా సునీల్‌ అరోడా తెలిపారు. అందులో ఈ-ఓటింగ్‌ కూడా ఒకటని వివరించారు. ఇందుకోసం ఐఐటీ- మద్రాస్‌, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఆధార్‌తో ఓటరు కార్డును జత చేసే అంశంపై కూడా పనిచేస్తున్నామని వివరించారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ సాధ్యం కావాలంటే ఇప్పుడున్న చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుందని అరోడా తెలిపారు. అందుకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం అవసరమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శిక్షణలోని ఐపీఎస్‌ అధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు పంపించడాన్ని ఆయన కొనియాడారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అందుకోసం ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని