Elon Musk: ప్రియురాలితో విడిపోయిన ఎలాన్‌ మస్క్‌! - elon musk and grimes break up after dating for 3 years twitter reacts
close
Published : 25/09/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Elon Musk: ప్రియురాలితో విడిపోయిన ఎలాన్‌ మస్క్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన ప్రియురాలితో విడిపోయారా? మూడేళ్ల తమ బంధానికి స్వస్తి పలికాడా? అనే ప్రశ్నకు అంతర్జాతీయ మీడియా అవుననే అంటోంది. 2018 నుంచి గ్రైమ్స్‌ అనే యువతితో ఎలాన్‌ మస్క్‌ డేటింగ్‌లో ఉన్నాడు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నాడు. కాగా ఈ జంట విడిపోయినట్లు ‘పేజ్‌ సిక్స్‌’ అనే వార్తా సంస్థ వెల్లడించింది. అయితే వారు విడిపోయినప్పటికీ.. స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించనున్నారని, కుమారుడు  ‘X AE A-12’ బాధ్యతలను కలిసి పంచుకోనున్నట్లు సమాచారం.

ఎలాన్‌ మస్క్‌ పేజ్‌ సిక్స్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘మేము పాక్షికంగా విడిపోయినప్పటికీ.. స్నేహపూర్వకంగానే ఉంటాం. తరచూ కలుసుకుంటాం’ అని పేర్కొన్నారు. ‘స్పేస్‌ఎక్స్,  టెస్లా సంస్థలకు సంబంధించిన పనుల్లో భాగంగా.. నేను టెక్సాస్‌లో లేదా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆమెతోపాటు కుమారుడు కూడా ఇప్పుడు నాతోనే ఉన్నారు’ అని తెలిపారు. అయితే వారు విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ వార్త విన్న ఎలాన్‌ మస్క్‌ అభిమానులు కలత చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని