ఇంగ్లాండ్‌ జట్టుకు జరిమానా - england fined for slow over-rate against india in fourth t20i
close
Published : 20/03/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌ జట్టుకు జరిమానా

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియాతో నాలుగో టీ20లో నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు ఇంగ్లాండ్‌ జట్టుకు జరిమానా విధించారు. ఆటగాళ్ల మ్యాచు ఫీజులో 20% కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. నిర్దేశిత సమయంలోగా పూర్తి ఓవర్లు వేయకపోవడంతో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్ వారిపై‌ జరిమానా వేశారు. ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణేమీ జరగలేదు.

మొతేరా వేదికగా జరిగిన నిర్ణయాత్మక టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సూర్యకుమార్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6), రిషభ్‌ పంత్‌ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లాండ్‌ పేసర్లపై కుర్రాళ్లు ఎదురుదాడికి దిగడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పదేపదే మోర్గాన్‌ సలహాలు తీసుకుంటూ బంతులు వేశారు. దాంతో ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆంగ్లేయులను టీమ్‌ఇండియా 8 పరుగులు తేడాతో ఓడించింది. 177/8కి వారిని పరిమితం చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని