ఇంగ్లాండ్‌కు షాక్‌: 2వన్డేలకు మోర్గాన్‌ దూరం - england men odi squad update
close
Published : 26/03/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌కు షాక్‌: 2వన్డేలకు మోర్గాన్‌ దూరం

పుణె: టీమ్‌ ఇండియాతో నిర్ణయాత్మక వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు పెద్ద షాక్‌! ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌కు సారథ్యం వహిస్తాడు. మరో ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌ రెండో వన్డేకు అందుబాటులో ఉండడని ఈసీబీ తెలిపింది. యువ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టన్‌ అరంగేట్రం చేస్తాడని వెల్లడించింది.

కోహ్లీసేనతో తొలివన్డేలో మోర్గాన్‌ చేతికి గాయమైంది. కుడిచేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య చీలిక ఏర్పడింది. అయినప్పటికీ ఆ మ్యాచులో అతడు బ్యాటింగ్‌కు దిగడం గమనార్హం. గురువారం మధ్యాహ్నం పుణెలో అతడు ఫీల్డింగ్‌ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అతడు ఫిట్‌గా లేడని ఈసీబీ తెలిపింది. తొలి వన్డేలో బిల్లింగ్స్‌ లెఫ్ట్‌కాలర్‌ ఎముకకు ఇబ్బంది ఏర్పడటంతో రెండో వన్డేకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అదనపు ఆటగాడిగా ఉన్న డేవిడ్‌ మలన్‌ను జట్టులోకి తీసుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని