అమ్మో ఎండ: బరువు తగ్గిన ఇంగ్లాండ్‌ క్రికెటర్లు! - england players suffered weight loss in fourth test against india says stokes
close
Published : 10/03/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మో ఎండ: బరువు తగ్గిన ఇంగ్లాండ్‌ క్రికెటర్లు!

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియాతో ఆఖరి టెస్టు సమయంలో తమ ఆటగాళ్లు హఠాత్తుగా బరువు తగ్గారని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతతో ఇబ్బందుల పడ్డారన్నాడు. మ్యాచ్‌, సిరీస్‌ ఓటమికి మాత్రం దీనినో సాకుగా చెప్పబోమని వెల్లడించాడు. ఈ సిరీసును రూట్‌ సేన 1-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

‘ఇంగ్లాండ్‌ను మెరుగైన స్థానంలో ఉంచేందుకు ఆటగాళ్లంతా అంకితభావంతో ఉన్నారు. ఐతే, 41 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల మాలో కొందరం అస్వస్థతకు గురయ్యాం. నేను వారంలో 5 కిలోలు తగ్గాను. డామ్ ‌సిబ్లీ 4, జిమ్మీ అండర్సన్‌ 3 కిలోలు తగ్గారు. బౌలింగ్‌ స్పెల్స్‌ మధ్య జాక్‌లీచ్‌ ఎక్కువగా మరుగుదొడ్లోనే గడిపాడు’ అని స్టోక్స్‌ చెప్పాడు.

‘ఏదేమైనా దీనిని మేం సాకుగా చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడికి ఆడటానికే వచ్చాం. టీమ్‌ఇండియా, రిషభ్‌ పంత్‌ ప్రదర్శనలు విధ్వంసకరంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ గెలుపు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ నేను వందనం చేస్తున్నాను’ అని బెన్‌స్టోక్స్‌ తెలిపాడు. టెస్టు సిరీసులో ఇంగ్లాండ్‌ పేలవ ప్రదర్శనలపై వస్తున్న విమర్శలను పట్టించుకోబోమని అతడు చెబుతున్నాడు.

‘విమర్శకులకు ఓ పనుంది. దానిని వారు చేస్తున్నారు. మమ్మల్ని మెరుగైన ఆటగాళ్లుగా, మెరుగైన జట్టుగా తీర్చిదిద్దడం మాత్రం వారి బాధ్యత కాదు. అది మా పని. మేం చూసుకోవాల్సిన పని. కెప్టెన్‌, కోచ్‌లు, జట్టు సభ్యుల అభిప్రాయాలే మాకు అత్యంత కీలకం. మా జట్టులో చాలామందికి భారత్‌లో ఇదే తొలి సిరీస్‌. నేర్చుకుంటున్న దశలో ఇలాంటి ఓటములు వారి ఆత్మవిశ్వాసాన్ని చెల్లాచెదురు చేస్తాయి. నా కెరీర్లో నేనూ ఇలాంటివి అనుభవించాను. ఏదేమైనా నిరాశ నుంచి బయటపడి ప్రేరణతో ముందుకెళ్లడం ముఖ్యం’ అని స్టోక్స్‌ వెల్లడించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని