కోహ్లీ విధ్వంసం: ఇంగ్లాండ్‌ లక్ష్యం 157 - england targe 157
close
Updated : 16/03/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ విధ్వంసం: ఇంగ్లాండ్‌ లక్ష్యం 157

అహ్మదాబాద్‌: మొతేరాలో విరాట్‌ కోహ్లీ (77; 46 బంతుల్లో 8×4, 4×6) మోత మోగించాడు. తన కళాత్మక విధ్వంసం కొనసాగించాడు. ఇంగ్లాండ్‌ పేసర్ల వేగాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. మణికట్టును ఉపయోగిస్తూ అందం ఉట్టి పడే బౌండరీలు.. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. వరుసగా రెండో అర్ధశతకం చేశాడు. దాంతో 20 ఓవర్లకు భారత్‌ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25; 20 బంతుల్లో 3×4) కాసేపు అలరించాడు. హార్దిక్‌ (17; 15 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించాడు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మార్క్‌వుడ్‌ (3/31) చురకత్తుల్లాంటి బంతులకు రాహుల్‌ (0), ఇషాన్‌ కిషన్ (4)‌, రోహిత్‌ (15) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని