దంచేసిన కోహ్లీసేన: ఇంగ్లాండ్‌ లక్ష్యం 225 - england target 225
close
Published : 20/03/2021 20:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దంచేసిన కోహ్లీసేన: ఇంగ్లాండ్‌ లక్ష్యం 225

అహ్మదాబాద్‌: కోహ్లీసేన జూలు విదిల్చింది. మొతేరాను మోతెక్కించింది. సిక్సర్ల వర్షం కురిపించింది. బౌండరీల వరద పారించింది. సిరీసులో తొలిసారి పరుగుల తుపాను సృష్టించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), విరాట్‌ కోహ్లీ (80*; 52 బంతుల్లో 7×4, 2×6) ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడిన వేళ టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది.

ఆఖరి టీ20లో 2 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 225 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఇంగ్లిష్ పేసర్లకు అసలు సిసలైన సవాల్‌ విసిరింది. మార్క్‌వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌, జోర్డాన్‌, కరన్‌, బెన్‌స్టోక్స్‌కు ఏం చేయాలో అర్థంకాక విలవిల్లాడారు. ఓవరుకు 10+ పరుగులు ఇచ్చేశారు. హార్దిక్‌ పాండ్య (39*; 17 బంతుల్లో 4×4, 2×6), సూర్య కుమార్‌ (32; 17 బంతుల్లో 3×4, 2×6) సైతం రెచ్చిపోయి ఆడేశారు. ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని