టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ - england won the toss and elected to bowl
close
Updated : 28/03/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో వన్డే సిరీస్‌ నిర్ణయాత్మకమైన ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి వన్డే సిరీస్‌ను సైతం తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రెండో వన్డేలో బలంగా పుంజుకున్న ఇంగ్లాండ్‌ ఇప్పుడు గెలుపొంది వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లూ హోరాహోరీ తలపడే అవకాశం ఉంది. మరి ఎవరు గెలిచి విజయం సాధిస్తారో వేచి చూడాలి.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, నటరాజన్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, డేవిడ్‌ మలన్‌, జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌కరన్‌, అదిల్‌ రషీద్‌, టాప్లీ, మార్క్‌వుడ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని