కోహ్లీ నైజమే అంత: మోర్గాన్‌ - eoin morgan reacts on the virat kohli and jos buttlers heated exchange saying thats not uncommon
close
Published : 22/03/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ నైజమే అంత: మోర్గాన్‌

బట్లర్‌తో మాటలయుద్ధంపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌

(Photo:BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఇంగ్లిష్‌ వికెట్‌ కీపర్‌ జాస్‌బట్లర్‌ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఆసక్తిరేపింది. అయితే, ఇద్దరి మధ్యా ఏం జరిగిందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కేవలం వాళ్లిద్దరు పరస్పరం దూషించుకోవడమే కనిపించింది. ఇదే విషయంపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తాజాగా స్పందించాడు. అవన్నీ ఆటలో భాగమని, అందులో పెద్ద విచిత్రమేమీ లేదన్నాడు.

ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 188/8 స్కోరుకే పరిమితమై.. 36 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ‌(52; 34 బంతుల్లో 2x4, 4x6), డేవిడ్‌ మలన్‌ (68; 46 బంతుల్లో 9x4, 2x6)తో కలిసి రెండో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, భువనేశ్వర్‌ వేసిన 13వ ఓవర్‌ ఐదో బంతికి అతడు హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కి ఔటయ్యాడు. దాంతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ ఆగ్రహంలో ఏదో అనుకుంటూ పెవిలియన్‌బాట పట్టాడు. అది విన్న విరాట్‌కోహ్లీ సైతం నోటికి పని చెబుతూనే బట్లర్‌ వెంట కొద్ది దూరం వెళ్లినట్లు వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలోనే మోర్గాన్‌ ఆ విషయంపై స్పందించాడు.

‘అసలక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు. సహజంగా విరాట్‌ ఏదైనా మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తే దూకుడుగా ఉంటాడు. అతడిది సహజ నైజం. ఆటను బట్టే తన హావభావాలు ప్రదర్శిస్తుంటాడు. కొన్నిసార్లు ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ఎవరికైనా గొడవలు జరుగుతాయి. అదేం పెద్ద విచిత్రం కాదు. అదొక సంఘటనగానే నేను భావిస్తున్నా’ అని మోర్గాన్‌ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్‌ (64; 34 బంతుల్లో 4x4, 5x6), కోహ్లీ(80*; 52 బంతుల్లో 7x4, 2x6) చెలరేగిపోయారు. తర్వాత సూర్యకుమార్‌ (32; 17 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌పాండ్య (39; 17 బంతుల్లో 4x4, 2x6) సైతం రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 3-2 తేడాతో పొట్టి సిరీస్‌ను‌ కైవసం చేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని