AP news: పోలవరం డిజైన్లు మార్చినా... అంత డబ్బు ఇవ్వలేం: కేంద్రం - even if polavaram designs change not much money can be given says center
close
Published : 26/07/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP news: పోలవరం డిజైన్లు మార్చినా... అంత డబ్బు ఇవ్వలేం: కేంద్రం

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్‌వర్క్స్‌, డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ చెప్పినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా  ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గోదావరి ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలన్నారు. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని తెలిపారు. కాఫర్‌ డ్యామ్‌, పునాది పనులు, స్పిల్‌వే, డయాఫ్రం వాల్‌ పనులు, చిప్పింగ్‌, స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు అదనంగా చేపట్టామని ఏపీ చెప్పినట్లు కేంద్రం తెలిపింది. అయితే, వీటికోసం అదనంగా నిధులు కేటాయించబోమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని