సీనియర్‌ బౌలర్లు రిటైరైనా ఫర్వాలేదు: షమి - even if senior bowlers get retire there are youngsters ready for team india says pacer mohammed shami
close
Published : 01/04/2021 07:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియర్‌ బౌలర్లు రిటైరైనా ఫర్వాలేదు: షమి

దిల్లీ: సీనియర్‌ బౌలర్లు రిటైరైతే బాధ్యతలు స్వీకరించడానికి యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అభిప్రాయపడ్డాడు. ఈ సంధి దశ సాఫీగా సాగుతుందనడానికి ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయంలో జూనియర్‌ బౌలర్ల ప్రదర్శనే నిదర్శనమని తెలిపాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో షమి, బుమ్రా, ఇషాంత్, ఉమేశ్‌యాదవ్‌ల గైర్హాజరీలో మహ్మద్‌ సిరాజ్, శార్దూల్‌ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్‌ సుందర్‌లు సత్తాచాటిన సంగతి తెలిసిందే. ‘‘మేం రిటైరయ్యే సమయానికి బాధ్యతలు స్వీకరించేందుకు యువ బౌలర్లు సిద్ధంగా ఉంటారు. ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా రాటుదేలుతారు. మేము ఆటకు దూరమైనప్పుడు సంధి దశ సాఫీగా సాగుతుందని భావిస్తున్నా. పేరున్న ఆటగాడు రిటైరైనా జట్టు ఇబ్బంది పడబోదు. రిజర్వ్‌ బెంచ్‌ పటిష్టంగా ఉంది. అనుభవం ఎల్లప్పుడూ అవసరమే. త్వరలోనే యువ ఆటగాళ్లు అనుభవం సంపాదిస్తారు. బయో బబుల్‌ వాతావరణం నేపథ్యంలో నెట్‌ బౌలర్లుగా తీసుకెళ్లడం యువ ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని షమి పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని